Thursday, December 7, 2023

మణుగూరు ఆడపడుచులకు పుట్టింటి కానుక.. ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం..

మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు మండల ఆడపడుచుల పుట్టింటి కానుక పేరుతో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణలో భాగంగా 6వ ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ సంతోష్ నగర్ లో శ‌నివారం ఉదయం బిటిపిఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీంద్రనాథ్, మణుగూరు ప్రముఖ గోల్డ్ షాప్ వ్యాపారి దుగ్గీ సతీష్ కుమార్, ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమరం జంపేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్య‌క్షులు దోసపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాస రావు, ట్రెజరర్ రంగా శ్రీ‌నివాసరావు, సలహాదారులు ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసఫ్ సార్, మిట్టపల్లి గోపి, మంగి మల్లికార్జున్, చిట్టి మల్లేష్, చంద్రకాని వినీల్ కుమార్, పాలవెల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement