Thursday, May 2, 2024

తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్ ల‌పై లోక్ స‌భ‌లో నామా గ‌ళం..

న్యూఢిల్లీ/ఖ‌మ్మం: తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్ ల‌పై లోక్ స‌భ‌లో ఖ‌మ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర రావు కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రైల్వే బ‌డ్జెట్‌పై నేడు లోక్‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ లో ఆయ‌న మాట్లాడుతూ.. ‘భ‌ద్రాచ‌లం-కొవ్వూరు రైల్వేలైన్ మార్గం డెవ‌ల‌ప్ చేయ‌లేద‌న్నారు. రామ‌ మందిరం ఉన్న భ‌ద్ర‌చ‌లం ఊరికి రైల్వే రూటు వేయ‌లేద‌న్నారు. ఎన్ని సార్లు కోరినా రైల్వే ట్రాక్ వేయ‌డం లేద‌న్నారు. రామ మందిరం ఉన్న భ‌ద్రాచ‌లంకు మార్గం వేయాల‌ని ఆయ‌న కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొవ్వురుతో క‌నెక్టివిటీ ఆగిపోయింది’ అని అ‌న్నారు. ‘తెలుగు ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నారు. స్టేట్ డివిజ‌న్‌లో ఉన్న రీఆర్గ‌నైజేష‌న్ యాక్ట్ హామీల‌ను నెర‌వేర్చాల‌ని’ కోరారు.
‘రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. కోచ్ ఫ్యాక్ట‌రీని ఇచ్చేందుకు పార్ల‌మెంట్ అగ్రీ చేసిందని, ప్ర‌భుత్వం ఆ ఒప్పందం అమ‌లు చేయాలి. యాక్ట్ చేసిన త‌ర్వాత అమ‌లు కాకుంటే.. ప్ర‌భుత్వంపై విశ్వాసం కోల్పోతాం. కాజీపేట‌కు రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వాలి. క‌చ్చితంగా ఇవ్వాలి. బ‌డ్జెట్‌లో దాన్ని మెన్ష‌న్ చేయాల‌ని’ ఎంపీ నామా తెలిపారు. రైల్వే లైన్ల గురించి ప్ర‌స్తావిస్తూ.. ప‌ఠాన్‌చెరువు, సంగారెడ్డి, భువ‌న‌గిరి, నిజామాబాద్‌, బోధ‌న్, బీద‌ర్ మార్గాల్లో విస్త‌ర‌ణ కోసం బ‌డ్జెట్ లో ఏమీ కేటాయించ‌లేదన్నారు. కొత్త రాష్ట్రానికి కేటాయింపులు క‌ల్పించండి.. అంటూ ఎంపీ నామా కోరారు.
ఖ‌మ్మంలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు వెనుక‌బ‌డి ఉన్నాయని, ఖ‌మ్మం రైల్వే స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్ పెంచాల‌ని కోరామ‌న్నారు. స్టేష‌న్‌లో కెమెరాలు ఏర్పాటు చేయండి. ఎంపీ ల్యాడ్స్ రెండేళ్లు లేవ‌న్నారు. ఆర్‌వోబీ, ఆర్‌యూబీల‌ను పూర్తి చేయాల‌ని అభ్య‌ర్థించారు. ‘కేంద్ర ప్ర‌భుత్వ ఫండ్స్‌తో ఆర్‌వోబీ గేట్ల‌ను పూర్తి చేయాల‌న్నారు. అనుమ‌తి ఇస్తున్నారు.. కానీ డ‌బ్బులు ఇవ్వ‌డం’ లేదన్నారు. మ‌రి ప‌నులు ఎలా జ‌రుగుతాయ‌ని నామా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చండి అంటూ లోక్‌స‌భ‌లో నామా ప్ర‌భుత్వాన్ని కోరారు’

Advertisement

తాజా వార్తలు

Advertisement