Tuesday, May 7, 2024

ఇక్క‌డ అమ‌లు – అక్క‌డ ఆద‌ర్శం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్న సంకేతాలిస్తూ.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్థానికంగా బలమైన రాజకీయ పార్టీ జేడీఎస్‌ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టింది. ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న జేడీఎస్‌, తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తోంది. ఇంకా మేనిఫెస్టోను అధికారికంగా రిలీజ్‌ చేయకపోయినా, అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 12 అంశాలను మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, ఆసరా పింఛన్ల వంటి స్కీమ్స్‌తోపాటు- అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాల పెంపు, అత్యంత ప్రాధాన్యతా రంగంగా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు వంటి అంశాలు ఉన్నాయి. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు- జేడీఎస్‌ ప్రకటించనుంది.

పొరుగు రాష్ట్రం.. నిత్యం అక్కడి ప్రజలతో సంబంధా లున్న ప్రాంతం కాబట్టి, కర్ణాటకలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం భూమి గుండ్రంగా ఉందన్న చందంగా ఎటునుంచి చూసినా తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ రంగాల చుట్టే తిరుగు తోంది. జేడీఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ స్కీమ్స్‌ ప్రకటించడం అక్కడి ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుం టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పథకాలు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ వ్యూహాల్లో జేడీఎస్‌కు అన్ని కోణాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధి విధానాలు, సంక్షేమ పథకాలపై కన్నడుల ఆసక్తి పెరుగుతోంది.

మన రైతుబంధు లాంటిదే.. కర్ణాటకలో ‘రైతు చైతన్య’
తెలంగాణ రైతుబంధు పథకాన్ని గతంలోనే అధ్యయనం చేసిన కుమారస్వామి అదే తరహా పథకాన్ని ప్రచారాస్తంగా ఎంచుకున్నారు. ”రైతు చైతన్య” పేరుతో కర్ణాటకలో అమలు చేయనున్నట్లు- ఎన్నికల ప్రణాళికలో జేడీఎస్‌ ప్రకటించింది. సొంత భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందజేయనున్నట్లు- స్పష్టం చేసింది. రైతు కూలీలకు నెలకు రూ.2వేల చొప్పున అందించనున్నట్లు- వెల్లడించింది. తెలంగాణలో అమలవుతున్న ఆసరా పింఛన్లను కూడా జేడీఎస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ప్రస్తుతం వికలాంగులకు నెలకు రూ.600గా ఉన్న పింఛన్‌ను ”వికల చేతన ఆసరా” పేరుతో నెలకు రూ.2,500కు పెంచనున్నట్లు- తెలిపింది. వితంతు మహిళలకు కూడా ప్రస్తుతం అందుతున్న రూ.900 పింఛన్‌ను రూ.2,500కు పెంచనున్నట్లు- పేర్కొంది.

హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లో ఖచ్చితమైన ప్రభావం
తెలంగాణ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయనున్నట్లు- ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి గతంలోనే హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఇప్పుడు మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌- కర్ణాటక ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటు-ందని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. జేడీఎస్‌ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటూ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ప్రకటించారు. కానీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నుంచి ఈ అంశంపై ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. ఈ నెల చివర్లో లేదా మే నెల ప్రారంభంలో హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంలో ప్రచారం చేసే అవకాశం ఉన్నది.

- Advertisement -

తెలుగు మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం
కర్ణాటకలో తెలుగు మాట్లాడే ఓటర్లు సుమారుగా 30 శాతానికి పైబడి ఉంటారు. ఎన్నికల ప్రచారం కోసం ధారాలంగా మాట్లాడే ఒకరిద్దరు నేతలను ఇక్కడి నుంచి పంపించేందుకు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలను ప్రస్తావించడంతో పాటు- జేడీఎస్‌ తన మేనిఫెస్టోలో పెట్టినవాటిని కూడా తెలుగు మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వివరించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్తం చేసిన ‘రైతుబంధు’ పథకం ద్వారా తెలంగాణ రైతుల్లో పెరిగిన జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిపుష్టి గురించి వివరించనున్నారు.

కాళేశ్వరం తరహా ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లతో ప్రణాళిక
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు గురించి వివ రించడంతోపాటు- కర్ణాటకలో జేడీఎస్‌ అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చుతో రానున్న ఐదేళ్ల కాలంలో నిర్మించే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించే అవకాశముంది. తెలంగాణ పథకాలు దేశానికే రోల్‌ మోడల్‌ అని ఇప్పటివరకూ ప్రచారం చేసు కుంటు-న్న బీఆర్‌ఎస్‌ నేతలు తాజాగా జేడీఎస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొన్నవాటిని ప్రస్తావించి అన్ని పార్టీలకూ అనుసరణీయమనే నినా దాన్ని అందుకోనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌ విజయానికి తెలంగాణ వ్యూహం కలిసివస్తే.. అది బీఆర్‌ఎస్‌ పార్టీకి కూ డా ప్లస్‌ పాయింటేనని ఆ పార్టీకి చెందిన నేతలంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement