Monday, April 29, 2024

TS | మగ్గం పట్టి వస్త్రం నేసి ఓట్లను అభ్యర్థించిన మంత్రి గంగుల సతీమణి రజిత

మగ్గం పట్టి వస్త్రం నేసి కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి గంగుల కమలాకర్ సతీమణి రజిత ఓట్లు అభ్యర్థించారు. శనివారం రాత్రి లక్ష్మీ పూర్, మల్కాపూర్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ తోనే సంక్షేమం సాధ్యమవుతుందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గంగుల కమలాకర్ అభివృద్ధి చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోవద్దన్నారు.

సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ప్రచారంలో బారాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement