Monday, May 6, 2024

నిబంధనలు పాటించకపోతే వాహనాల సీజ్..

రవాణా శాఖ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేస్తామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహంచారు. నంబరు ప్లేటు లేని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్దంగా కార్లకు వేసిన బ్లాక్‌ స్టిక్కర్లను తొలగించారు. రహదారిపై ఆక్రమణలను తొలగించారు. అనంతరం మాట్లాడుతూ రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు సబ్‌ డివిజన్‌ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధృవీకరణపత్రాలు కలిగి ఉండాలని, లేకపోతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధిస్తామన్నారు. తనిఖీలలో పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, అశ్వినితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement