Tuesday, May 14, 2024

కరీంనగర్ లో రంజాన్ కిట్ల పంపిణీ

కెసిఆర్ రంజాన్ కిట్లు పంపిణీ కరీంనగర్ లో గురువారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగకు కానుకగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రంజాన్ కిట్లను మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆదేశానుసారం 18వ డివిజన్లోని షేఖాన్ నగర్లో ఇంటింటికి వెళ్లి రంజాన్ కిట్లను అందించారు. 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement