Saturday, April 27, 2024

కాంగ్రెస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారేడుగొండకు చెందిన ఆరగొండ రాజ్‌కుమార్‌ను నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్‌ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం రానున్న రోజుల్లో యువత కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం నియామకపత్రాన్ని అందించారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్యలకు రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement