Sunday, May 5, 2024

పెద్దపల్లిలో ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక వైశ్య భవన్ లో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలను పేర్చి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రమాదేవి, మాధవి తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement