Tuesday, May 7, 2024

ట్రాఫిక్ పోలీసుల సేవలు గుర్తించాలి: కరీంనగర్ సిపి

మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులకు లైఫ్ లైన్ ఆస్పత్రి వారిచే కూలింగ్ గ్లాసెస్, కరీంనగర్ డైరీ వారిచే మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తమ సిబ్బంది మండుటెండల్లో సైతం సేవలందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్, లైఫ్ లైన్ ఆసుపత్రి ప్రశాంత్ తో పాటు కరీంనగర్ డైరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement