Wednesday, September 27, 2023

అగ్ని ప్రమాదం.. భారీ నష్టం

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి పట్టణం చేకురాయి రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారి పక్కన బుదవారం తెల్లవారుజామున పీవీ ఎంటర్ ప్రైసెస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాక్టర్లు టైర్లు, విడిభాగాలు, దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.69 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు దుకాణం నిర్వాహకులు పొన్నం శంకరయ్య, కృష్ణమూర్తి తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement