Friday, April 26, 2024

వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో.. సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు సస్పెండ్..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్ట‌ర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎ.హరిప్రియ, సుబేదారి ఎస్ఐ పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.ఆర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్ పెక్ట‌ర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్ఐ హరిప్రియ ఇరువురు గత కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరించడంతో మహిళ ఎస్ఐ భర్త ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం పోలీస్ కమిషనర్ ఇన్స్ పెక్ట‌ర్ ఆర్.వెంకటేశ్వర్లు, మహిళ ఎస్ఐ హరిప్రియ ఇరువురిని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వురులు జారీ చేసారు. మరో సంఘటనలో సుబేదారిలో నివాసం ఉంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపుల‌కు గురికావడంతో రక్షణ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.పున్నంచందర్ ఆశ్రయించగా సదరు ఎస్ఐ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీపడాల్సిందిగా బాధితురాలికి సూచినట్లుగా.. వచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ సుబేదారిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement