Friday, April 26, 2024

ఉమ్రాన్ మాలిక్ ని ప్రేమించేందుకు..155కార‌ణాలు

శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టీ20మ్యాచ్ లో 155కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేసి లంక కెప్టెన్ దాషున్ ష‌ణ‌క వికెట్ తీశాడు. ఈ బంతిని షణక గట్టిగా బాదగా.. అది వెళ్లి యుజ్వేంద్ర చాహల్ చేతుల్లో పడింది. ఈ సందర్భంగా కెప్టెన్ హార్థిక్ పాండ్యా కళ్లు మూసుకుని నవ్వులు చిందించాడు. 27 బంతుల్లోనే 45 పరుగులు బాదేసి శ్రీలంకను గెలిపించబోయిన షనక వికెట్ తీయడం భారత్ విజయానికి దోహదం చేసిన అంశాల్లో ఒకటి. లేదంటే శ్రీలంక విజయం సాధించి ఉండేది. ముఖ్యంగా శివమ్ మావి 4 వికెట్లతో మెరవగా, ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లతో విజయంలో భాగస్వాములయ్యారు. చివర్లో శ్రీలంక బౌలర్లు వానిందు హసరంగ, కరుణరత్నే బ్యాట్ ను ఝుళిపించారు.

అయినప్పటికీ హసరంగ ఎక్కువ సేపు వికెట్ ను కాపాడుకోలేకపోయాడు. అతడ్ని శివమ్ మావి పెవిలియన్ దారి పట్టించాడు. ఈ మ్యాచ్ తో ఉమ్రాన్ మాలిక్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించి, అత్యంత వేగవంతమైన భారత పేసర్ గా అవతరించాడు. జస్ప్రీత్ బుమ్రా 153.3 కిలోమీటర్ల వేగం ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా ఉంది. కాగా భారత యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బౌలింగ్ లో మరో గుర్తింపు సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి లంక కెప్టెన్ దాషున్ షణక వికెట్ తీశాడు. ఉమ్రాన్ మాలిక్ వేగంలోనే కాదు, లైన్ అండ్ లెన్త్ లోనూ మెరుగుపడుతున్నట్టు వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం మాలిక్ మద్దతుగా ట్వీట్ పెట్టింది. 155 కారణాలు ఉమ్రాన్ మాలిక్ ను ప్రేమించేందుకు’ అని చిన్న ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement