Monday, May 6, 2024

KNR: రక్తదానం మరొకరికి ప్రాణదానం.. సీపీ రెమా రాజేశ్వరి

రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలియజేశారు. మంగళవారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని 6006 మంది రక్తదానం చేయనున్నారని, 21 జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు 6006 యూనిట్ల రక్తం అందించనున్నామన్నారు. తల సేమియా వ్యాధిగ్రస్తులు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో పాటు పలువురు హాజరవుతారన్నారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్, సిఐలు అనిల్, జగదీష్, ఎస్సై లు మహేందర్, వెంకటేష్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి శ్రీనివాస్, రెడ్ క్రాస్ కరీంనగర్ జిల్లా చైర్మన్ కేశవరెడ్డి, పడాల రవి, రాజగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement