Sunday, April 28, 2024

కోవిడ్‌ టీకాతో వ్యాధి నిరోధక శక్తి..

కాల్వశ్రీరాంపూర్‌: కోవిడ్‌ టీకాతో వ్యాధినిరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణకు శ్రీరామరక్షగా నిలుస్తుందని ఎంపీపీ నూనెటి సంపత్‌, జెడ్‌పిటిసి వంగల తిరుపతిరెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని కిష్టంపేటలో సర్పంచ్‌ కాసర్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు విధిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం, శానిటైజర్‌ను వాడాలన్నారు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాతో ప్రజలు అప్రమత్తమవుతున్నారని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో తాకిడి పెరిగిందన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ మన కోసం, కుటుంబ సభ్యులు, చుట్టు ఉన్న వారి కోసం తప్పనిసరిగా టీ-కా వేయించుకోవాలన్నారు. సర్పంచ్‌ కాసర్ల తిరుపతిరెడ్డిని అభినందిస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల సర్పంచులు టీకా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి కోవిడ్‌ వాక్సిన్‌ వేసినట్లు డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాలకవర్గం, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement