Wednesday, May 15, 2024

కిసాన్‌, జవాన్‌ల వ్యతిరేకి బీజేపీ.. దేశ రక్షణను గాలికొదిలిన కేంద్రం : మంత్రి కొప్పుల

జగిత్యాల, (ప్రభన్యూస్‌): దేశంలో రైతులు, జవాన్ల వ్యతిరేకిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌ అంశాన్ని వ్యతిరేఖిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం, ఓ యువకుడు మృతిచెందడం బాధాకరమన్నారు. ధర్మం కోసం దేశం కోసమని చెబుతున్న బిజెపి వాస్తవికంగా కిసాన్లకు, జవాన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు.

దేశానికి రైతులు, సైనికులే నిజమైన నాయకులని నమ్మే దేశంలో వారినే అపహస్యం పాలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో నల్లచట్టాలతో రైతులను వంచించిన బిజెపి ఇప్పుడు అగ్నిపథ్‌.. అగ్నివీర్లు అంటూ జవాన్లను బజారురులో పడేస్తోందన్నారు. బీమా నుండి మొదలు కొని రక్షణ రంగం వరకు అన్నింటిని ప్రైవేటీ-కరణ చేస్తున్న బిజెపి ప్రభుత్వం దేశానికే అత్యంత కీలకమైన రక్షణ విభాగంలోనూ అసంబద్దమైన నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. అగ్నిపథ్‌.. అగ్నివీర్‌లాంటి పథకాలతో రక్షణ రంగంలో నిపపుణులైన సైనికులు లేకుండా చేసేందుకు యత్నిస్తుందన్నారు.

18 ఏళ్ల వారిని రక్షణ రంగంలోకి తీసుకొని నాలుగేళ్లపాటు- ఉద్యోగం కల్పించడం, తదుపరి వారికి రిటైర్మెంట్‌ కల్పించేలా వ్యవస్థను రూపొందించడం సమంజసం కాదన్నారు. దేశ రక్షణలో ప్రాణం పెట్టే సైనికుల విషయంలో అసంబద్ధమైన నిర్ణయాలతో వారిని అవమానించడం సరికాదన్నారు. దేశ వ్యాప్తంగా ఆగ్నిపథ్‌పై నిరసనలు వెల్లువెత్తుతుంటే, తెలంగాణలో అల్లర్లకు టీ-ఆర్‌ఎస్‌ కారణమనేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బుద్ధి ఉండాలన్నారు. తెలంగాణ యువత సైతం అగ్నిపథ్‌ విషయంలో సంయమనం పాటించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement