Sunday, May 19, 2024

భరోసా యాత్ర..

ఎన్‌టీపీసీ: ఆర్‌ఎఫ్‌సిఎల్‌ పున: ప్రారంభంలో ఎఫ్‌సీఐ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చేందుకు భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్‌ కడారి సునీల్‌, కో కన్వీనర్‌ తోకల రమేష్‌లు పేర్కొన్నారు. ఎఫ్‌సిఐ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి భరోసా యాత్ర ప్రారంభించారు. ఎఫ్‌ సిఐ మూసివేతతో వీధినపడ్డ కాంట్రాక్ట్‌ కార్మికులు సుమారు 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అరుణోదయ కళాకారులు వేముల లక్ష్మణ్‌, చందు స్తూపం వద్ద విప్లవ గీతం పాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ యజమాన్యం కాంట్రాక్టు కార్మిక కుటు-ంబాలకు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ లొకేషన్‌లలో ముందు రిక్రూట్‌మెంట్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించవద్దని కోరారు. కాంట్రాక్ట్‌ కార్మికులు అధైర్య పడకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాల-కై- నిరంతరం పోరాటం కొనసాగించాలని కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు శనగల శ్రీనివాస్‌, ఇనుగాల రాజేశ్వర్‌, డి శంకర్‌, రమేష్‌, ఆర్‌విఎస్‌ ప్రసాద్‌, సురేష్‌, ప్రసాద్‌, రాములు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement