Sunday, December 4, 2022

మంత్రుల పర్యటనకు బందోబస్తు.. ఏసిపి సారంగపాణి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన నేపథ్యంలో ప్రటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. బుధవారం మంత్రులు హాజరయ్యే ఆసుపత్రి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బహిరంగ సభ కోసం వచ్చే ప్రజలు పోలీసులు సూచించిన ట్రాఫిక్ పాయింట్లలో వాహనాలు నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ధర్మారం ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement