Tuesday, April 16, 2024

మిస్టరీ కథగా హిట్2.. ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంఛ్

యంగ్ హీరో అడివి శేషు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం హిట్2.ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు..హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అలరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సంజన అనే ఒక యువతి హత్య కేసును గురించి పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణ జరపడాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఫైనల్ టచ్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హిట్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement