Monday, May 13, 2024

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

రామగిరి: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న రామగిరి యువ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మంథని అసెంబ్లీ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ బర్ల శ్రీనివాస్‌, పన్నూరు ఎంపీటీ-సీ చిందం మహేష్‌, కల్వచర్ల ఎంపీటీ-సీ కొట్టె సందీప్‌, ఎన్‌ఎస్‌యుఐ జనరల్‌ సెక్రటరీ నరేష్‌, రామగిరి యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోత్కూరి అవినాష్‌ గౌడ్‌, మండల ప్రచార కార్యదర్శి మట్ట రాజ్‌కుమార్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సిద్ధం మురళి, యువజన కాంగ్రెస్‌ మండల నాయకులు వేగోలపు సంతోష్‌, తాండ్ర ప్రవీణ్‌లున్నారు. వీరికి మండల కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ తోట చంద్రయ్య, పన్నూర్‌ మాజీ ఎంపిటిసి ముస్త్యాల శ్రీనివాస్‌లు సంఘీభావం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement