Sunday, October 17, 2021

హెటిరోకు చెందిన రూ.142 కోట్ల న‌గ‌దు సీజ్‌

హెటిరో ఫార్మ‌సీ సంస్థ‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు చేసిన దాడుల్లో మొత్తం రూ. 142 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ నెల 6న హెటిరో సంస్థ‌కు చెందిన 6 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జ‌రిగాయి. మొత్తం ఆరు రాష్ట్రాల్లో జ‌రిగిన త‌నిఖీల్లో రూ.142 కోట్ల నగదు ల‌భ్య‌మైంద‌ని అధికారులు తెలిపారు. లెక్క‌కు రాని ఆదాయం సుమారు రూ.550 కోట్లు ఉంటుంద‌ని చెప్పారు. సోదాల స‌మ‌యంలో 16 బ్యాంక్ లాక‌ర్లు ఉన్న‌ట్లు గుర్తించారు. హెటిరో సంస్థ‌పై మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు సాగుతున్నారు. కాగా, కోవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన రెమిడిసివిర్‌, ఫావిపిరావిర్ లాంటి ఔష‌ధాల‌ను హెటిరో సంస్థ ఉత్ప‌త్తి చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణం: పయ్యావుల

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News