Thursday, December 9, 2021

ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి.. భార్య ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం కనకవీడు పేటా గ్రామానికి చెందిన కురువ మనోహర్ అనే ఆర్మీ జవాన్ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే, భర్త మనోహర్ మృతి వార్త జీర్ణించుకోలేక భార్య రామదేవి(కల్పనా) శుక్రవారం రాత్రి ఆమె సొంత గ్రామం గురుజాలలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనోహర్ మృతి, భార్య ఆత్మహత్య ప్రయత్నంతో పేటా, గురుజాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, మనోహర్ భార్య నిండు గర్భిణీ అని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రసవం ఉందని డాక్టర్లు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆగని పెట్రో మోత.. నేటి రేట్లు ఇవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News