Wednesday, April 24, 2024

విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణం: పయ్యావుల

ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖపై ఆయన మండిపడ్డారు. విద్యుత్‌ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోకుండా వేరే దేశాలతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండగా.. చైనా గురించి జగన్‌కు ఎందుకని పయ్యావుల ప్రశ్నించారు. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్‌ విషయంలో తెలంగాణ మెరుగ్గా ఉందని తెలిపారు. అయితే, ఏపీలో విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని విమర్శించారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. సీఎం నోటి వెంట అర్ధ సత్యాలు.. అవాస్తవాలు పలికిస్తోంది అధికారులేనని తెలిపారు. సీఎంతో అసత్యాలు పలికిస్తూ.. అధికారులు ప్రధానికి లేఖ రాయించారని ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో రిజర్వాయర్లు నిండిన సమయంలో కూడా విద్యుత్‌ కోతలేంటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement