Sunday, April 28, 2024

HYD: మొదటి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించిన జిస్ గ్రూప్

హైదరాబాద్: దాదాపు 178 సంవత్సరాలుగా ఆప్టిక్స్ మరియు ఆప్టోఎలక్ట్రానిక్స్‌ సైన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న జిస్, స్పెక్స్‌బంకర్‌తో కలిసి హైదరాబాద్‌లో తమ మొదటి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దాదాపు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రతిష్టాత్మక సెంటర్ ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అత్యాధునిక కంటి సంరక్షణ పరిష్కారాలను అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ సంద‌ర్భంగా స్పెక్స్‌బంకర్ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ… దాదాపు 2 సంవత్సరాల క్రితం బెంగుళూరులో తాము విజయవంతంగా జిస్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ఆ స్పందన అందించిన ఉత్సాహం తో హైదరాబాద్‌లో మొదటి జిస్ విజన్ సెంటర్‌ను పరిచయం చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు.

ఈ వ్యూహాత్మక విస్తరణ, వృద్ధికి సంబంధించి త‌మ లక్ష్యంతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడిందన్నారు. కార్ల్ జిస్ ఇండియా (బెంగళూరు) ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా అండ్ నైబ‌రింగ్ మార్కెట్స్ బిజినెస్ హెడ్ రోహ‌న్ పౌల్ మాట్లాడుతూ… భారతదేశమంతటా ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ పరిష్కారాలను అందించడంలో త‌మ నిబద్ధతను మరింతగా పెంచుతూ, హైదరాబాద్‌లో మొదటి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించడం కోసం స్పెక్స్‌బంకర్‌తో భాగస్వామ్యం చేసుకోవటానికి తాము సంతోషిస్తున్నామన్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెంగుళూరులో ప్రారంభించిన సెంటర్ ద్వారా స్పెక్స్‌బంకర్‌తో త‌మ భాగస్వామ్య విజయాన్ని ఇప్పటికే ప్రదర్శించామన్నారు. అక్కడ తాము వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన, సానుకూల అభిప్రాయాన్ని అందుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement