Wednesday, May 15, 2024

IPL 2024లో తొలి శ‌త‌కం కోహ్లీదే..

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ బౌలర్లను పరుగులు పెట్టిస్తూ ఈ సీజ‌న్‌లో తొలి శతకం బాదాడు. 67 బంతుల్లో కోహ్లి తన ఎనిమిదో ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. మెత్తం 72 బంతుల్లో 113 ప‌రుగులు సాధించాడు. ఇక‌ ఈ సెంచరీతో కోహ్లి ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

కోహ్లీ రికార్డుల మోత..

ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ ఈ మ్యాచ్ లో 113 పరుగులు చేయడంతో.. ఒకే జట్టు తరపున 8000కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా మ‌రో రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 34 పరుగులతోనే ఐపీఎల్‌లో 7500 పరుగులు సాధించిన తొలి ఆడగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు 242 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8 సెంచ‌రీలు, 52 హాఫ్ సెంచ‌రీలతో 7566 పరుగులు చేసి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

- Advertisement -

అలాగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ 62 పరుగులు చేసిన కోహ్లీ.. రాజస్థాన్ రాయల్స్‌పై ఎక్కువ పరుగులు 680 చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ఐపీఎల్‌లో 679 పరుగులు చేసిన శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్, సురేష్ రైనా & దినేష్ కార్తీక్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement