Monday, April 29, 2024

TS | సార్వత్రిక ఎన్నికలకు రాహుల్ శంఖారావం.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ శంఖారావాన్ని పూరించారు. ఈ సభలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 5 హామీలతో కూడిన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. తుక్కుగూడలో జరిగిన జన జాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కొన్ని నెలల క్రితం తుక్కుగూడలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 6 హామీలను వెల్లడించాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల హామీల మేనిఫెస్టోను ‘నయా పాత్రం’గా ఆవిష్కరించామని చెప్పారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అయినా చెప్పినట్లుగానే కాంగ్రెస్ అమలు చేసింది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను ఇచ్చింది.’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

- Advertisement -

మేనిఫెస్టో ‘‘న్యాయ పత్రం’’ 5 గ్యారంటీలు…

1) నిరుద్యోగులకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను అందిస్తాం. అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. జాతీయ ఉపాధి తరహాలో దేశ వ్యాప్తంగా ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. యువలకులకు సంబంధించి ఎన్నో విషయాలు చేర్చినట్లు మేనిఫెస్టో చూస్తే మీకు అర్థమవుతుంది.

2) ఉద్యోగం చేసే మహిళలు కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటూ రెండు డ్యూటీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా మంది పేదలయ్యారు. వీరి కోసం నారీ న్యాయ్ స్కీ్మ్ తీసుకొస్తున్నాం. ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష రూపాయలు అందిస్తాం. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

3) కిసాన్ న్యాయం – దేశంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మోదీ సర్కార్ ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఏ న్యాయం చేయలేదు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తాం. పంట కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్ధతు ధర కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

4) కార్మికులకు న్యాయం – కార్మికులకు, కూలీలకు కనీస వేతనం తీసుకొస్తాం. జాతీయ ఉపాధి పథకంలోగానీ, ఇతర పథకాల కింద రోజువారి పనులు చేస్తే రోజూ కనీసం రూ.400 వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

5) దేశంలో 50 మంది జనాభా వెనకబడి ఉన్నారు. 15 శాతం జనాభా దళితులు ఉన్నారు. 8 శాతం జనాభా ఆదివాసీలు, గిరిజనులు ఉన్నారు. 15 శాతం మైనార్టీలు ఉన్నారు. 5 శాతం జనాభా జనరల్ కేటగిరికి చెందిన నిరుపేదలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 90 శాతం జానాభా వీరే. కానీ వీళ్లు ఏ పెద్ద సంస్థలో ఉండరు. వీరికి అంతగా అవకాశాలు లేవు. మీడియా కంపెనీ ఓనర్లను గమనిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనిపించరు. దేశంలో పెద్ద కంపెనీల జాబితా చూస్తే వీళ్లు ఒక్కరూ కనిపించరు. దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ లలో ముగ్గురు బీసీలున్నారు. వీరిలో ఒక్క గిరిజనుడు, దళితులు ముగ్గురు మాత్రమే ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ లో ఖర్చయ్యే 100లో కేవలం 6 రూపాయలను దళితులు, ఆదివాసీలకు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో చేసినట్లు దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement