Sunday, April 28, 2024

Srimukhi : శ్రీముఖ‌కి గోల్డెన్ ఛాన్స్ …..

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై పలు షోలల్లో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

- Advertisement -

బుల్లితెర పై ఒక షోలో శ్రీముఖి కనిపించిందంటే సందడి మాములుగా ఉండదు.. ప్రతి పండక్కి శ్రీముఖి షో ఖచ్చితంగా ఉంటుంది.. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మడుకు ఎక్కువనే చెప్పాలి.. గతంలో శ్రీముఖి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. అయితే హీరోయిన్గా ట్రై చేసింది.. కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేక పోయింది.. దాంతో మళ్లీ బుల్లితెరనే నమ్ముకుంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది..

శ్రీముఖి ఓ పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో శ్రీముఖి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో శ్రీముఖి కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement