Sunday, April 28, 2024

అక్రమంగా మద్యం అమ్మకాలు..

కవాడిగూడ : నిబంధనలు వినడానికి బాగుంటాయి.. చెప్పడానికి చాలా బాగుంటాయి.. అమలు చేయడం మాత్రం అస్సలు పాటించరు. లంచగొండులు ఉన్నంత కాలం ఏ నిబంధనలు పనికిరావనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని జీవోలు, చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితం. అమలు చేయడానికి మాత్రం అస్సలు అంగీకరించరు. ఈ మాటలన్ని ఇక్కడ జరుగుతున్న అక్కమ మద్యం అమ్మకాలకు సరిగ్గా సరిపోతుంది. అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌ పోలీసులు ఒకరిని మించి ఒకరు పోటీపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ముషీరాబాద్‌ నుంచి పద్మరావునగర్‌ వెళ్లె మార్గంలో ఉన్న ఓ వైన్‌షాపు నిర్వహాకులు అడ్డదారిలో మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. పేరుకు మాత్రం వైన్‌షాపు షట్టర్‌ కిందినుంచి, దొడ్డిదారిలో యదేచ్చగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. చిలకలగూడ లా ఆండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు అందిన కాడికి దండుకోని అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డదారిలో అమ్మకాలు జరపడమే కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా మహామ్మారి వలన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని సాక్షాత్తు హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెడితే ఈ నెల 20నుంచి 30వరకు 10 రోజులపాటు.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్య్ఫూ విధిస్తూ ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా బార్‌ ఆండ్‌ రెస్టారెంట్లు, వైన్ ‌షాపులు నిత్యం రాత్రి గంటలకల్లా ముసివేయాలని నిబంధనలు విధించారు. ఈ వైన్‌షాపు నిర్వహాకులు నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల వరకు అడ్డదారిలో అక్రమంగా అధిక ధరలకు బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని వైన్‌షాపు లైసెన్స్‌ రద్దు చేసి శాశ్వతంగా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు, ఎక్సైజ్‌ శాఖల కమీషనర్‌లను కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement