Tuesday, May 7, 2024

మళ్లీ రూ.50వేలకు చేరువలో బంగారం ధరలు

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతోంది. దీంతో పసిడి ధర మళ్లీ రూ.50 వేలకు చేరువలోకి వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి దీనికి కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,640గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.75,100కి చేరింది. కాగా ఇండియా మార్కెట్‌లో తులం బంగారం ధ‌ర ఈ నెల‌లోనే రూ.4000కి పైగా పెరిగింది. ఈ నెల ఆరంభంలో తులం బంగారం రూ.44 వేల వ‌ద్ద ఊగిసలాడింది. త‌ర్వాత యూఎస్ బాండ్ల‌తో పాటు డాల‌ర్ బ‌ల‌హీన ప‌డ‌టంతో అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే సెప్టెంబ‌ర్ నాటికి తులం బంగారం ధ‌ర మ‌రోమారు రూ.50 వేల మార్కు దాటుతుంద‌ని బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement