Sunday, April 28, 2024

TS: వికారాబాద్ డిటిఓగా పి. వెంకట్ రెడ్డి

వికారాబాద్, ఫిబ్రవరి 15 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా (డిటిఓ) వెంకట్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో సూర్యాపేట జిల్లా జిల్లా రవాణా శాఖ అధికారి గా పనిచేసిన ఆయన వికారాబాద్ జిల్లా డీటీవోగా బ‌దిలీపై వ‌చ్చారు.

ఈ సందర్భంగా తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలను పాటించాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నియమ నిబంధనలు ధ్రువపత్రాలు సరిగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement