Monday, May 6, 2024

HYD: వాసవి మెడికల్స్ డాక్టర్ కన్సల్టేషన్ ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : వాసవి మెడికల్స్ ల్యాబ్ సర్వీసెస్ డాక్టర్ కన్సల్టేషన్ ను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు. హైదరాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చింతలకుంట, ఆర్టీసీ కాలనీ వాసవి శ్రీ నిలయం అపార్ట్ మెంట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి మెడికల్స్ ల్యాబ్ సర్వీసెస్ ను ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించడం జ‌రిగింది.

ఈ సందర్భంగా ముందుగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతించి, అనంత‌రం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షాప్ ఓనర్ శ్రీనివాస్ గుప్తా, గంజి సందీప్, అంజిరెడ్డి, క్రాంతి, అపార్ట్ మెంట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement