Thursday, May 2, 2024

AP: షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

తిరుపతి సిటీ, ఆగస్టు 19 (ప్రభ న్యూస్) : యశ్వంత్ అనే వ్యక్తి శనివారం తన హుండాయ్ క్రెటా కారులో తనపల్లి నుంచి బైరాగి పట్టెడకు వెళుతుండగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. యశ్వంత్ కారులోంచి దిగి దూరం పరిగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది.

షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు బాధితుడు తెలిపాడు. కారు విలువ 16 లక్షల రూపాయలని తెలిపారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement