Monday, May 6, 2024

వెల్‌స్పన్ సహకారంతో రాష్ట్రానికి రెండు ప్రత్యేక అవార్డుల‌తో గుర్తింపు

హైదరాబాద్ :భారతదేశంలోని ప్రముఖ బహుళజాతి సంస్ధలలో ఒకటైన వెల్‌స్పన్, తమ అత్యుత్తమ సహకారం కోసం ప్రతిష్టాత్మక గుర్తింపును అందుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దం పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్న మహోన్నత వేడుకల్లో భాగంగా జూన్ 6, 2023న జరిగిన తెలంగాణ పారిశ్రామిక వృద్ధి ఉత్సవంలో ఈ అవార్డులు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి వెల్‌స్పన్ అందిస్తున్న సహకారం పట్ల వెల్‌స్పన్ కు ఉన్న తిరుగులేని నిబద్ధతను గుర్తించి గౌరవనీయమైన అవార్డుతో సత్కరించారు.

ఈ అవార్డును సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం, డా.ఎస్.హరీష్, ఐఏఎస్, కలెక్టర్ – రంగారెడ్డి జిల్లా, తీగల అనితారెడ్డి, జ‌డ్పీ చైర్‌పర్సన్ – రంగారెడ్డి జిల్లా, రాజేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ సహా అతిథులు వెల్‌స్పన్ కు అందించారు. ఈ గుర్తింపుపై వెల్‌స్పన్ ప్రతినిధి మాట్లాడుతూ… తెలంగాణలో వస్త్ర పరిశ్రమ వృద్ధి పట్ల తమ అచంచలమైన అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు. వెల్‌స్పన్ తమ వనరులను, నైపుణ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉందన్నారు. చుట్టుపక్కల ఉన్న సమాజాలను ఉద్ధరించడంతో పాటుగా రాష్ట్ర సమగ్ర పురోగతికి సైతం తోడ్పడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement