Monday, April 29, 2024

Big Breaking | కేపీకి అషురెడ్డితో ఆ రిలేషన్​ ఉందా?.. డ్రగ్స్​ డీల్స్​లో కదులుతున్న డొంక

హైదరాబాద్​ డ్రగ్స్​ కేసులో డొంక కదులుతోంది. సినీ నిర్మాత కేపీ చౌదరినీ పోలీసులు విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండ్రోజులుగా జరుగుతున్న పోలీసుల ఎంక్వైరీలో తనకు పలువురితో డీలింగ్స్​ ఉన్నట్టు కేపీ చౌదరి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందులో కొద్దిమంది వివరాలు మాత్రమే వెల్లడించినట్టు తెలుస్తోంది. కేపీ లిస్టులో పలువురు సెలబ్రిటీలున్నారు. తెలుగు బిగ్​బాస్​ సీజన్​లో పాల్గొన్న నటి కూడా ఉందని సమాచారం.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

డ్రగ్స్​ సప్లయ్​ చేస్తూ హైదరాబాద్​ పోలీసులకు దొరికిన నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతను ఎన్నో సీక్రెట్స్​ రివీల్​ చేసినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరితో లింక్స్​ ఉన్నాయనే విషయాలు వెల్లడించినట్టు అవగతమవుతోంది. ఇక.. తెలుగు ఐటెమ్​ సాంగ్స్​లో చేసిన మరో హీరోయిన్​ కూడా కేపీతో టచ్​లో ఉన్నట్టు సమాచారం. మరో నటితో కలిసి డీల్స్​ చేశారని, వీరికి వందల సంఖ్యలో ఫోన్​ కాల్స్​ సంభాషణ జరిగినట్టు పోలీసులు నిర్ధారించకున్నారు.

అయితే.. వీరి ఫోన్​ సంభాషణల విషయంలో కేపీ చౌదరి నోరు మెదపడం లేదని సమాచారం అందుతోంది. కాగా, 12 మందికి డ్రగ్స్​ సప్లయ్​ చేసినట్టు కేపీ చౌదరి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కేపీ బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. దీంతో కేపీ ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. కేపీ లిస్టులో డ్రగ్స్​ కన్స్యూమర్ల పేర్లు కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది. రఘు తేజ, సనా మిశ్ర, సుశాంత్​రెడ్డి, నితినేశ్​, బెజవాడ భరత్​, శ్వేత, టాగోర్​ ప్రసాద్, చింతా రాకేశ్​ రోషన్​, అతడి భార్య సాయి ప్రసన్న​ వంటి వారి పేర్లను గుర్తించారు.

- Advertisement -

ఇక.. మరో సెలబ్రిటీ అయిన సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిపేవారని, అందులో డ్రగ్​ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీ అషురెడ్డితో కేపీకి డీలింగ్స్​ ఉన్నట్టు గుర్తించారు. వందల కాల్స్​ మాట్లాడినట్టు ఆధారాలున్నాయి. సినీ నటులు అషురెడ్డి, జ్యోతి, సురేఖవాణితో వందలాది కాల్స్​ జరిపినట్టు తెలుస్తోంది. వీరి మధ్య జరిపిన సంభాషణలను, కాల్​ లిస్ట్​ని డీకోడ్​  చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement