Sunday, May 5, 2024

ఆఫరింగ్‌ శుద్ద్‌ బైటాటా సాల్ట్‌ను ప్రాంతీయ మార్కెట్ల‌లో విడుద‌ల చేసిన టీసీపీఎల్

భారతదేశంలో అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) తమ తాజా ఆఫరింగ్‌ శుద్ద్‌ బైటాటా సాల్ట్‌ను భారతదేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతీయ మార్కెట్‌లలో విడుదల చేసింది. శుద్ధ్‌ బై టాటా సాల్ట్‌ అనేది అయోడైజ్డ్‌ సాల్ట్‌ బ్రాండ్‌. ఈసంద‌ర్భంగా శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ ఆవిష్కరణ గురించి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్స్ ఇండియా అధ్యక్షులు దీపక్‌ భాన్‌ మాట్లాడుతూ… ఉప్పు విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా, భావి మార్కెట్‌ అవసరాలను గుర్తించడంతో పాటుగా సృజనాత్మకంగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ను తాము వినియోగించే ఉప్పు నాణ్యత పట్ల అసలు రాజీపడని నిర్ధిష్టమైన విభాగపు వినియోగదారుల అవసరాలను తీర్చే రీతిలో సృష్టించామన్నారు. వినియోగదారుల అవసరాలను తీర్చే రీతిలో అత్యున్నత నాణ్యత, సౌకర్యవంతమైన ఉత్పత్తులను అందించాలనే త‌మ నిబద్ధతకు ఈ ఆవిష్కరణ ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ ఒకే కేజీ గరిష్టంగా 20 రూపాయల ధరలో లభిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement