Tuesday, May 7, 2024

రెండో విడత గొర్రెల పంపిణీకి రుణం విడుదల.. హర్షం వ్యక్తం చేసిన బాలరాజు యాదవ్

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కెసీఆర్ నాయకత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకత్వంలో నుతనంగా పునర్ నియామకమైన పశు సంవర్దక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదార్ సిన్హ, అధికారులు కృషితో ఎన్సీడీసీ ద్వారా రూ.4563 కోట్లు రుణం మంజూరు కావడంతో రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. పునర్ నియామకమైన అదార్ సిన్హ ను సత్కరించి భవిష్యత్తులో సీఎం కేసీఆర్ కు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలోచన మేరకు గొర్రెలు, మేకల సంపదతో పాటు, పశు సంపద వాటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఉత్పత్తి కులాల అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు.

అదేవిధంగా శాఖలో పనిచేస్తున్న అధికారులు కృషి చేస్తారని చైర్మన్ తెలిపారు. 2014లో కేంద్ర గణాంకాల లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1 కోటి 20 లక్షలు మాత్రమేనని, 2020-21 గణాంకాల ప్రకారం 1కోటి 90 లక్షలకు చేరిందన్నారు. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, దేశంలోనే అగ్రస్థానంకు చేరిందని, సీఎం కేసీఆర్ నాయకత్వం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకంలో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కారణమని డాక్టర్ దూదిమెట్ల తెలిపారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ కలలకు అనుగుణంగా కార్పొరేషన్ పని చేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement