Sunday, May 19, 2024

ఇండియాకి వస్తున్న పోకో ఎఫ్​4 5జీ.. అఫీయల్​ డేట్​ అనౌన్స్​ చేసిన కంపెనీ!

పోకో ఎఫ్4 5జీ ఇండియాలో లాంచ్ అయ్యే డేట్ ఫిక్స్ అయ్యింది. కొద్దిరోజులుగా ఈ మొబైల్‌ గురించి టీజ్​ చేస్తూ వచ్చిన పోకో.. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా డేట్‌ను ప్రకటించింది. మిడ్ రేంజ్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ ఈనెల 23న భారత్‌లో అడుగుపెట్టనుంది. గ్లోబల్‌గా కూడా ఇదే రోజు విడుదల కానుంది. ఈ విషయాన్ని పోకో ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. భారత్‌లో పోకో ఎఫ్4 5జీ ప్రారంభ ధర రూ.27వేలలోపు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. లాంచ్‌కు ముందే పోకో ఎఫ్4 5జీకి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉండనుంది.

4,500mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్నట్టు తెలుస్తోంది. HDR10+ విజన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండే ఫుల్ హెచ్‌డీ+ E4 AMOLED డిస్‌ప్లేను పోకో ఎఫ్4 5జీ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సైజ్ 6.67 ఇంచులుగా ఉండొచ్చు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. డ్యుయల్ స్టీరియో స్పీకర్ల సెటప్ ఉండనుంది. Poco F4 5G వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండొచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో Poco ఈ ఫోన్‌ను తీసుకొస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement