Monday, April 12, 2021

కెసిఆర్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌శంస‌లు..

హైదరాబాద్‌ : నగర పర్యటనకు వచ్చిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ వర్మను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ మాట్లాడుతూ ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్రంలో అమలవుతున్న పలు కార్యక్రమాలను దేశంలోనూ అమలు చేస్తున్నాం. అందుకు ఉదాహరణే ‘జల్ జీవన్ మిషన్‌’ పథకం అని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరాన్ని అద్భు తంగా అభివృద్ధి చేస్తున్నారు. పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నగరంలో పచ్చదనం పెరిగింది’ అని కొనియాడారని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ వెంట అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News