Saturday, April 20, 2024

శిధిలావస్థలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్‌ ఉన్నికోట బస్తీలో పేద ప్రజల కోసం పక్కా ఇండ్ల పంపిణీ ఎప్పుడు చేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణం పూర్తయి దాదాపు 8 సంవత్సరాలు అయినప్పటికి పంపిణీ చేయకపోవడంతో ఇండ్లు శిధిలావస్థకు చేరాయి. పక్కాఇండ్లు లబ్ధిదారులకు అందించడంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పధకం కింద దాదాపు 465 ఇళ్ళ నిర్మాణం పూర్తికాగా మరో రెండు బ్లాక్‌లలో 32ఇళ్ళ నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నికోట బస్తీలో ప్రస్తుతం 420 ఇళ్ళు కేటాయించారు. దాదాపు మరో 45 ఇండ్లు లబ్దిదారులకు కేటాయించాల్సిఉంది. మరో 36 ఇండ్ల గోడవ కోర్టులో ఉంది. ఇదిలా ఉండగా బస్తీకి చెందిన దాదాపు అందరికి పట్టాలు ఇచ్చి ఇండ్లు కేటాయించినప్పటికీ కోందరు బస్తీకి చెందిన యువకులు తమకు ఇండ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఒక్కోక్క ఇంటిలో రెండు, మూడు, ఇండ్ల పట్టాలు జారీ చేసినట్లు అధికారులు చేపుతున్నారు. ఇండ్ల కేటాయింపుకు కొందరు అడ్డుతగలడం వల్ల తాము పం పిణీ చేయలేకపోతున్నామని రెవిన్యూ అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పత్యేక చోరవ తీసుకోని పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వడం కష్టతరమని భావించి పేదలందరికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద జీప్లస్‌ త్రీ విధానంలో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. 2009లోనే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పధకం కింద పట్టాలు ఇచ్చిన వారికి పక్కా గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 45 మంది లబ్దిదారులకు ఇండ్లు కేటాంచలేదు. 2013 సంవత్సరం వరకు ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించి వారికి ఇళ్ళను అప్పగించాల్సిన రెవిన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. గడిచిన 9 సంవత్సరాలలో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు వస్తున్నారు…. పోతున్నారు…. తప్ప సమస్యను పరిష్కరించిన దాఖలాలు కనిపించలేదు. ఇండ్ల పంపిణీకి అడ్డు తగులుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోని లబ్దిదారులకు ఇండ్లను కేటాయించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement