Saturday, April 27, 2024

ఇంపాక్ట్‌ ఆధారిత వెంచర్‌ బిల్డింగ్‌ లక్ష్యంతో పెట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్యకలాపాలు

భారతదేశంలో స్టార్టప్స్‌ కోసం వెంచర్‌ బిల్డర్‌గా తమ కార్యక్రమాలను పెట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ మంగ‌ళ‌వారం ప్రకటించింది. గత సంవత్సర కాలంలో పెట్రిచార్‌ 6 స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టింది. తద్వారా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి రెండురెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈసంద‌ర్భంగా పెట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫౌండర్‌, శ్రావనాథ్‌ దేవభత్కిని మాట్లాడుతూ… ఎలాంటి స్టార్టప్‌ అయినా నాలుగు అంశాలు కావాల్సి ఉంటుందన్నారు. విజిబిలిటీ, మార్కెట్‌ భాగస్వామ్యాలు, మృదువైన కార్యకలాపాల కోసం అంతర్గత నిర్మాణం, టాలెంట్‌ ఎక్వైజేషన్‌, సాంకేతికతను ఎనేబలర్‌గా నిలుపుకోవడమ‌న్నారు. నూతన వ్యాపార ఆలోచనలకు నిలయంగా భారత్‌ నిలువడంతో పాటుగా అంతర్జాతీయ మదుపరులను ఆకర్షిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింతగా వృద్ధి చెందనుందని, సరైన ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలిసి సరైన సమయంలో, సరైన కంపెనీలో పెట్టుబడులు పెట్టనున్నామ‌ని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రతి సంవత్సరం నాలుగు స్టార్టప్స్‌లో పెట్టుబడులను పెట్రికార్‌ పెట్టనుందని, రాబోయే ఐదేళ్లలో 25 కంపెనీలను నిర్మించడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement