Thursday, March 28, 2024

కొనసాగుతున్న ఆర్​ఆర్​ఆర్​ అప్​డేట్స్.. మరో ఫుల్​ లెంగ్త్ సాంగ్​ రిలీజ్​ చేసిన టీమ్​​

వారానికో ఫుల్ వీడియో సాంగ్​ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం. ఇప్పటికే ‘నాటు నాటుస‌.. ‘కొమ్మ ఉయ్యాలా’, ‘దోస్తీ’ వీడియోలు పంచుకున్న టీమ్ తాజాగా సెలబ్రేషన్ ఆంథమ్ ‘ఎత్తర జెండా’ను అందించింది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసినా అందులో కథానాయకులు రామ్​చరణ్, ఎన్టీఆర్, కథానాయిక అలియా భట్ మాత్రమే కనిపించారు.

ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్ దేవ్​గన్​, ఒలివియా మోరిస్ కూడా తళుక్కున మెరిశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.. ఎంఎం కీరవాణి సంగీతం, విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, సాహితి చాగంటి, హరికా నారాయణ్ గానం ఎంతగా అలరించాయో తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం దాదాపు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల మీద రికార్డులు కొడుతున్న విషయం తెలిసిందే..

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement