Sunday, May 5, 2024

Phonepe: మర్చంట్‌ లెండింగ్‌ కోసం ఫోన్‌పే నుండి కొత్త వేదిక ఆవిష్కరణ

హైదరాబాద్‌ : తన మర్చంట్‌ లెండింగ్‌ వేదికను ఆవిష్కరించడం ద్వారా 35 మిలియన్లకు పైగా మర్చంట్లతో తనకున్న విస్తృతమైన మర్చంట్‌ పునాదికి పూర్తిగా డిజిటల్‌, నిరంతరాయ పద్ధతిలో బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌సీలు (నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు) రుణాలు ఇచ్చే వీలును కల్పించామని ఫోన్‌ పే ప్రకటించింది. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఆర్థిక సమ్మిళితత్వాన్ని ముందుకు నడపాలనే ఫోన్‌ పే నిబద్ధతతను పునరుద్ధాటించింది.

ఈ ఆవిష్కరణ గురించి సంస్థ ఆర్థిక సేవల విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ గలా మాట్లాడుతూ… ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం అనేది ఫోన్‌పే కార్యాచరణ ప్రణాళికలో కీలకమన్నారు. మార్కెట్‌ ప్లేస్‌ నమూనాను ఉపయోగించి, మన వేదికపై మర్చంట్‌ లెండింగ్‌ ను ఆవిష్కరించడం తమకు ఉత్సాహంగా ఉందన్నారు. ఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈలకు సంస్థాగత రుణాలను అందుబాటు-లోకి తెచ్చి, తద్వారా వాటి వృద్ధికి తోడ్పాటు- అందించనున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈ అండ్‌ ఎస్‌ఎంఈల ఆర్థిక సాధికారత కోసం ఉత్పేర్రకంగా పనిచేయడం ద్వారా సంపూర్ణ ఆర్థిక వృద్ధికి, నిలకడైన పురోగతిని ముందుకు నడపడానికి దోహదపడడం ఫోన్‌ పే గర్వంగా భావిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement