Saturday, April 27, 2024

Mangalagiri : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స అందించిన AOI

విజయవాడ : మయోకార్డియల్ ఇన్‌ ఫెక్షన్, ఇతర కార్డియాక్ సమస్యలు కలిగి ఉండటంతో పాటుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న 65ఏళ్ల పురుషునికి వైద్యపరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) మంగళగిరి విజయవంతంగా చికిత్స చేసింది. ఈసందర్భంగా మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ ఎస్.మణి కుమార్ మాట్లాడుతూ… రోగిని సమగ్రంగా పరీక్షించిన తరువాత, రోగి గుండె పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత SBRT ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకోబడిందన్నారు. ఈ చికిత్సా విధానం రోగి గుండె, చుట్టుపక్కల అవయవాలకు ప్రమాదాన్ని తగ్గించేటప్పుడు, కణితికి ఖచ్చితమైన రేడియేషన్ మోతాదులను అందించడానికి అనుమతిస్తుందన్నారు. తాము విజయవంతమైన ఫలితం పట్ల సంతోషిస్తున్నామన్నారు. రోగి అద్భుతమైన రీతిలో కోలుకోవడం AOIలో అందించబడిన సంరక్షణ, నైపుణ్యం నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

AOI, విజయవాడ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO) మహేందర్ రెడ్డి , AOI వద్ద సాంకేతిక పురోగతిని వెల్లడిస్తూ… AOI వద్ద తమ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందించడానికి అత్యాధునిక సాంకేతికత, వినూత్న చికిత్స ఎంపికలను ఉపయోగించుకోవడానికి తాము అంకితభావంతో కృషి చేస్తున్నామన్నారు. SBRTతో ఈ రోగికి విజయవంతమైన చికిత్సనందించటం క్యాన్సర్ సంరక్షణను అభివృద్ధి చేయడంలో, రోగులకు అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన, అనుకూలమైన చికిత్సలను పొందేలా చేయడంలో తమ అచంచలమైన అంకితభావానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement