Thursday, May 9, 2024

Sompet – ఆర్ టి సి బస్సు క్రింద పడి ఇంటర్ విద్యార్ది మృతి

సోంపేట నవంబర్ 14(ప్రభ న్యూస్ )సోంపేట పట్టణంలో శ్రీ కుమార్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి కుమార్ బెహరా (17) ప్రమాదం శాత్తు ఆర్. టి సి బస్సు క్రింద పడి మృతి చెందాడు

మంగళవారం సోంపేట పట్టణం లో కోరంజ భద్ర గ్రామానికి చెందిన సాయి కుమార్ బెహరా (17) బస్సు సీట్ కోసం ఆర్ సి కాంప్లెక్స్ లో ఆర్ టి సి వెనుక టైర్ ముందు కిటికీ వద్ద బస్సు లో సీట్ ఆఫర్ చేయటానికి కిటికీ వద్ద ఎగిరి ప్రమాదం చాత్తు ఆర్ టి సి టైర్ క్రింద పడ్డాడు దీంతో తీవ్ర గాయాలు కావటం తో సోంపేట ప్రభుత్వం సామాజిక ఆసుపత్రి కి తరలించారు.. పరిస్థితి విషమించటం తో మెరుగైన వైద్య సేవలు కోసం బరంపురం ఆసుపత్రి కి తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యలో సాయి కుమార్ బెహరా మృతి చెందినట్లు సోంపేట ఎస్ ఐ బి.హైమావతి తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement