Sunday, April 28, 2024

హైదరాబాద్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్ త‌యారీ…

హైదరాబాద్‌ : అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన మరో ఫార్మా సంస్థ ఉత్పత్తి చేయనుంది. బయోలాజికల్ ఈ సంస్థ తన సొంత వ్యాక్సిన్‌తో పాటు జేఅండ్‌జే వ్యాక్సిన్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుండగా.. ఈ విషయాన్ని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ధ్రువీకరించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి పని చేయనున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత టీకాతో పాటు జేఅండ్‌జే టీకాను సైతం ఉత్పత్తి చేయనున్నట్లు బయోలాటికల్‌ ఈ కంపెనీ ఎండీ మహిమా దాట్ల పేర్కొన్నారు. ఈ రెండు టీకాలకు మౌలిక వసతులు, ప్లాంట్లు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రెండింటిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేది, ఇతర వివరాలు తెలుపలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement