Monday, May 20, 2024

HYD: దేశంలో నెం.1 లా స్కూల్ గా శ్రేణీక‌రించ‌బ‌డిన జిందాల్ గ్లోబల్ లా స్కూల్

హైదరాబాద్ : ఒక అపూర్వమైన సాధన, గుర్తింపులో, ఓ.పి. జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయంలోని జిందాల్ గ్లోబల్ లా స్కూల్ వరుసగా 5వ సంవత్సరం కూడా భారతదేశంలోనే నెం. 1 లా స్కూల్ గా శ్రేణీకరించబడింది. ప్రపంచంలో 72వ ర్యాంకులో నిలుపబడింది. దీనితో ఇది ప్రపంచములోనే ఉత్తమ-100 లా స్కూల్స్ లో ఒకటి అయ్యింది. ఈసంద‌ర్భంగా ఓపీ జిందాల్ గ్లోబ‌ల్ విశ్వ‌విద్యాల‌యం వ్య‌వ‌స్థాప‌క కుల‌ప‌తి న‌వీన్ జిందాల్ మాట్లాడుతూ…. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్స్ లో దేశంలోనే ఉత్తమ లా స్కూల్ గా జేజిఎల్ఎస్ గుర్తించబడిన స్థిరత్వం నిజానికి భారతదేశంలో ప్రపంచ-స్థాయి విద్యను అందించాలనే తన లక్ష్యం నుండి ఎప్పుడు చెదరలేదనే అంశాన్ని సూచిస్తుందన్నారు.

తన ఉనికి కేవలం ఒక దశాబ్దంలో భారతదేశపు నెం.1 లా స్కూల్ గా జేజిఎల్‎ఎస్ ఆవిర్భావం దేశంలోని యువతలో నాణ్యమైన విద్య కోసం తృష్ణను కూడా సూచిస్తుందన్నారు. వారి ఆకాంక్షలను పూర్తి చేయడంలో జేజిఎల్‎ఎస్ విజయం సాధించడం త‌నకెంతో గర్వ కారణమన్నారు. ఓపీ జిందాల్ విశ్వ‌విద్యాల‌యం వ్య‌వ‌స్థాప‌క ఉప కుల‌ప‌తి ప్రొ. (డా.) సి. రాజ్ కుమార్ మాట్లాడుతూ… జిందాల్ గ్లోబల్ లా స్కూల్ (జేజిఎల్‎ఎస్) సబ్జెక్ట్ ద్వారా క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకులు 2024 లో వరుసగా ఐదు సంవత్సరాలు నెం. 1 గా ర్యాంకింగ్ చేయబడిందని షేర్ చేయటానికి తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా, జేజిఎల్‎ఎస్ 72వ స్థానంలో నిలిచిందని, తద్వారా ప్రపంచపు ఉత్తమ-100 సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఒకే ఒక్క భారతీయ లా స్కూల్ గా అయ్యిందన్నారు. ఇది జేజియూ, జేజిఎల్‎ఎస్ కు ఒక శుభ ఘడియ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement