Sunday, April 28, 2024

AP | రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాల‌న‌ను త‌రిమికొద‌డాం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో (శుక్రవారం) టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. కరువు, తుపాను కారణంగా రైతులు చాలా నష్టపోయార‌ని… అయితే తుపాన్ల కంటే అసమర్థ ముఖ్యమంత్రి వల్లే ఎక్కువ నష్టపోయామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టం జరిగితే ముఖ్యమంత్రి పరామర్శకు రాలేదన్నారు. ఇప్పుడు రైతుల కోసం సీఎం జ‌గ‌న్ మొసలి కన్నీరు కారుస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని విమర్శించారు. రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు… అమరావతి పూర్తైతే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని.. ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 తీసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీలో కొందరు మంచివాళ్లు.. మరికొందరు రౌడీలున్నారని.. ఆ రౌడీలు మనకు వద్దని ఆయన పిలుపునిచ్చారు. జగన్ బహిరంగ సభలకు వెళ్లకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం మరీ ఉన్మాదంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో పోలవరం ఎంత పూర్తైంది? రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు మూడు రాజధానులు ఎలా కడతారు?’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement