Tuesday, April 30, 2024

HYD: ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి దరఖాస్తు..

ఎల్బీనగర్, ఆగస్టు 25 ( ప్రభ న్యూస్) : ఎల్.బి నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎల్బీనగర్ ఇన్ ఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి
గాంధీభవన్ లో దరఖాస్తులు సమర్పించడానికి తరలివెళ్లారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఎల్ బి నగర్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గడ్డి అన్నారం డివిజన్ లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement