Tuesday, April 30, 2024

తమ స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన హైయెర్‌ ఇండియా

హోమ్‌ అప్లయెన్సస్, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామి కావడంతో పాటుగా మేజర్‌ అప్లయెన్సస్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా ప్రపంచంలో నెంబర్‌ 1 బ్రాండ్‌గా వెలుగొందుతున్న హైయెర్ గురువారం తమ మొట్టమొదటి స్మార్ట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ టెక్నాలజీ 2–ఇన్‌– 1 డ్రై అండ్‌ వెట్‌ మాప్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ గురించి హైయెర్‌ అప్లయెన్సస్‌ ఇండియా అధ్యక్షుడు సతీష్‌ ఎన్‌ఎస్‌ మాట్లాడుతూ… ఈ నూతన విభాగంలో ప్రవేశిస్తున్నామని వెల్లడించేందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. విప్లవాత్మక సాంకేతికతలతో కూడిన స్మార్ట్‌ సొల్యూషన్స్‌ను పరిచయం చేయాలనే తమ కేంద్రీకృత ప్రయత్నాలు తమకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నాయన్నారు. ఇవి అత్యంత ప్రభావవంతమైనవి, సమర్ధనీయమైనవన్నారు. హైయెర్‌ ఇండియా వద్ద తాము ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావాలనుకుంటున్నామన్నారు. ఈ నూతన ఆఫరింగ్ తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. కాలంతో పాటుగా తాము మరింత ముందుకు వెళ్తే, తాము తమ సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement