Monday, May 13, 2024

HYD: వినియోగదారుల్లో విశ్వాసానికి మార్గం సుగమం చేసిన డిజిటల్‌ ఇన్సూరెన్స్‌.. విశాల్‌ గుప్తా

హైదరాబాద్‌ : వినియోగదారుల్లో విశ్వాసం, భరోసాకు డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ మార్గం సుగమం చేసిందని ఫోన్‌ పే ఇన్సూరెన్స్‌ బ్యాకింగ్‌ సేవల విభాగం సీఈఓ విశాల్‌ గుప్తా తెలిపారు. ఆయన మాట్లాడుతూ… మన ఆర్థిక వ్యవహారాల నిర్వహణను మెరుగు పరచడానికి ఉపయోగపడే సాధనాల కోసం తాము సాగిస్తున్న నిరంతర అన్వేషణలో, వాటిని యూజర్లు అంగీకరింపజేసేలా నమ్మకాన్ని కలిగించడం అనేది కీలకమైన అంశంగా నిలుస్తోందన్నారు. బ్యాంకింగ్‌, పేమెంట్లకు సంబంధించినదైనా, ఇతర ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించినదైనా, నమ్మకం కలిగించడంలో ఎదురయ్యే సవాల్‌ను అధిగమించిన తర్వాతే దానికి అంతటా ఆమోదం లభిస్తుందన్నారు. ఈ నమ్మకానికి అడ్డంకి అనేది కేవలం ఆర్థిక సేవల రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఇ-కామర్స్‌, ఇ-టికెటింగ్‌, రైడ్‌-షేరింగ్‌, ప్రయాణ రంగాలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. అయినప్పటికీ, ఆర్థిక రంగం, ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులకు సంబంధించిన నెలకొన్న సంక్లిష్టమైన వాతావరణంలో వీటిని అంగీకరించడం అనేది ఆషామాషీగా జరిగేది కాదన్నారు. ఇటీ-వల వెల్లడైన ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ- ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) నివేదిక ప్రకారం, ఎఫ్‌ వై 21లో భారతదేశంలో ఇన్సూరెన్స్‌ వ్యాప్తి కేవలం 4శాతం మాత్రమే అని తెలిసిందన్నారు.

ప్రత్యేకించి, లైఫ్‌ ఇన్సూరన్స్‌ వ్యాప్తి 3శాతంకు చేరుకోగా, నాన్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాప్తి కేవలం 1శాతం దాటలేదు. ఈ అంకెలు, చూడడానికి చాలా స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ రంగం విస్తరణకు, పురోభివృద్ధికి గణనీయమైన అవకాశాలున్నాయనే విషయాన్ని కూడా చాటు-తోంది. పెట్టు-బడుల పెరుగుదలను ప్రోత్సహిస్తూనే, ఊహించని రిస్కులనుండి రక్షణ వలయాన్ని అందించడంలో ఇన్సూరెన్స్‌ అసమాన పాత్ర పోషిస్తుండడమే దీనికి కారణమని చెప్పవచ్చన్నారు. జనం అంతగా కొనకపోవడం, అందులో దీర్ఘకాలిక వాగ్దానాలు ఉండడం, అనివార్యమైన రిస్కులు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సూరెన్స్‌ రంగం పురోభివృద్ధి అయోమయానికి గురి చేస్తున్నట్టు- కనిపించవచ్చన్నారు. ఈ సంక్లిష్టత రెండు రకాల సాధారణ భయాలకు దారి తీస్తుందన్నారు. ఇందులో ఒకటి.. తప్పుడు కొనుగోలు చేస్తున్నామనే భయమన్నారు. ఉదాహరణకు తెలంగాణకు చెందిన 35 ఏళ్ల ఆదిత్యనే తీసుకుందాం. ఆయన పెట్టు-బడితో పాటు- తన కుటు-ంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఉమ్మడి ప్రయోజనాలను అందించే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఎంచుకున్నారన్నారు. అయినప్పటికీ రెండేళ్లు గడచిన తర్వాత, పెట్టు-బడి కోసం మరింత బాగా సరిపోగల ఆర్థిక సాధనాలు ఉన్నట్టు గ్రహించారన్నారు. ఒక -టె-ర్మ్‌ ప్లాన్‌ తన కుటు-ంబానికి సరైన భద్రతా వలయాన్ని అందిస్తుందని ఇప్పుడు అర్థం చేసుకున్నారన్నారు. దీంతో ఆదిత్య తన భవిష్యత్‌ ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి ఒకింత అయోమయానికి, ఆందోళనకు గురయ్యారన్నారు. అలాగే రెండోది.. అవసరమైన సమయంలో సొమ్ము చేసుకోలేమనే భయం అన్నారు. బాగా సంపాదిస్తూ, ఇటీ-వలే పెళ్లి చేసుకున్న ఢిల్లీకి చెందిన రాహుల్‌ విషయాన్ని తీసుకుందాం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆయన ఒక సంప్రదాయ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, వాస్తవానికి, ఖర్చుల అంచనా, 30సంవత్సరాల సుదీర్ఘ కాలం ఆయనకు తన నిజమైన అవసరాన్ని ఊహించడం సవాల్‌గా నిలుస్తోందన్నారు.

రాహుల్‌ కూడా తనకు మరణం సంభవిస్తే లేదా మూడు దశాబ్దాల తర్వాత తన హామీలను నెరవేర్చడంపై ఆందోళన చెందుతున్నారన్నారు.ఈ రెండు సన్నివేశాలు ఇన్సూరెన్స్‌ పాలసీల విషయానికి వచ్చేసరికి అర్థం చేసుకోవడంలో, నమ్మకం పొందడంలో అంతరాలను నొక్కి చెబుతున్నాయన్నారు. ఈ సవాల్‌ను పరిష్కరించడానికి నియంత్రణ సంస్థలు, తయారీ దారులు, పంపిణీ దారులతో కూడిన ఇన్సూరెన్స్‌ వాతావరణ వ్యవస్థ నుండి ఉమ్మడి ప్రయత్నాలు జరగాల్సి ఉందన్నారు. స్పష్టమైన సమాచారం, సూటిగా కనిపించే ఉత్పత్తులు, తేలికమయం చేసిన ప్రక్రియలపై పెట్టు-బడులు పెట్టే విషయంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇది బ్రాండ్‌ పైనే పూర్తిగా నమ్మకం కలిగి ఉండడాన్ని నొక్కి చెప్పడానికి బదులు సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాలపై వినియోగదారులకు నమ్మకం కలిగించడం సహా అన్ని కోణాల్లోనూ నమ్మకాన్ని విస్తరింపజేయాలన్నారు. ఇన్సూరెన్స్‌ రంగంలోకి వెళ్లడం వినియోగదారుకు చాలా క్లిష్టమైన అనుభవంగా ఉంటు-ందన్నారు. ఈ సంక్లిష్టతలో అనేక పొరలు ఉంటాయన్నారు. కో-పేమెంట్‌, క్యుములేటివ్‌ బోనస్‌లు, పరిశ్రమకు సంబంధించిన ఇతర పదజాలం తరచుగా ఒక శక్తివంతమైన అవరోధాన్ని సృష్టిస్తుందన్నారు. దీని వల్ల పాలసీ వివరాలు చాలా మందికి అర్థం కాలేదన్నారు.

- Advertisement -


మొత్తంపైన ఈ సంక్లిష్టతే ఈ ఆఫర్‌ను అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుందన్నారు. ఇది మరోవైపు నిర్ణయం తీసుకోవడాన్ని కూడా చాలా కష్టతరం చేస్తుందన్నారు. ఇటు-వంటి పరిస్థితులు ఇన్సూరెన్స్‌ ఏజెంట్లను విశ్వసించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తాయన్నారు. దీంతో వారు సమస్యలను పరిష్కరించడానికి ఏజెంట్ల నుండి సలహాలను కోరుకుంటారన్నారు. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల, మధ్యవర్తులపై ఇలా ఆధారపడటం వినియోగదారులు నిజంగా తమకు అవసరమైనది పొందడం కోసం ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకుంటు-న్నామనే భరోసా ఇవ్వకపోవచ్చన్నారు. నమ్మకం పొందడంలో చిక్కుముడులను పరిష్కరించడమన్నారు. తమ విస్తృత పరిధి, వినియోగదారు విశ్వసనీయతతో విభిన్నమైన మార్గంలో డిజిటల్‌ ప్రపంచంలో విశ్వాస-ఆధారిత సమస్యలను పరిష్కరించడంలో ఫోన్‌ పే లాంటి ప్లాట్‌ఫారంలు విజయవంతమయ్యాయన్నారు.

అవి వాతావరణాన్ని పునర్నిర్మించడంలో, వినియోగదారు నమ్మకాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో వాణిజ్యం, టికెటింగ్‌, బిల్లులు, ప్రామాణీకరణ, ప్రభుత్వ సేవలు (వీసా, పాస్‌పోర్ట్‌, ఫాస్టాగ్‌), మైక్రో పేమెంట్లు-, లోన్లు, పెట్టుబడులు వంటి వివిధ రంగాలు విజయవంతంగా డిజిటల్‌ ప్లాట్‌ఫారంలకు మారాయన్నారు. ఈ డిజిటల్‌ పరిణామాన్నిఇన్సూరెన్స్‌ రంగానికి విస్తరించడం అనేది విశ్వాసమనే చిక్కుముడిని పరిష్కరించి, స్వతంత్రంగా లావాదేవీలు చేసేందుకు వినియోగదారుల మధ్య నమ్మకాన్ని కలిగించడంపై ఆధారపడి ఉంటు-ందని తాము భావిస్తున్నామన్నారు. వినియోగదారుల మధ్య ఈ విశ్వాసమనే చిక్కుముడులను డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వాములు పరిష్కరించే కొన్ని మార్గాలు ఇలా ఉన్నాయన్నారు… నిష్పక్షపాత సలహా అందించాలన్నారు. సామర్థ్యాల విషయానికి వస్తే, డిజిటల్‌ పంపిణీ అనేది గొప్ప సానుకూలతను కలిగి ఉంటు-ందని, అంటే డిజిటల్‌ ప్లాట్‌ఫారంలు కస్టమర్‌కు సలహా ఇవ్వడం కోసం అయ్యే ఖర్చులను తిరిగి పొందడం గురించి ఎలాంటి ఆందోళన లేకుండా నిజంగా కస్టమర్‌-ప్రధానం అనే కోణంలో ముందుకు వెళతాయన్నారు. అలాగే పోలికలను క్రమబద్ధీకరించడం. చాలావరకు డిజిటల్‌ ప్లాట్‌ఫారంలు మార్కెట్‌ ప్లేస్‌ తరహా లో పని చేస్తూ, వివిధ ఇన్సూరెన్స్‌ సేవా సంస్థలు, వాటి ప్లాన్ల సాధారణ ఫీచర్ల మధ్య పారదర్శకమైన పోలికను అందిస్తాయి.

ఇవి కస్టమర్లకు వేటినీ విస్మరించకుండా అన్ని ఆప్షన్లను అన్వేషించే అవకాశాన్ని అందిస్తాయన్నారు. ఈ ప్లాట్‌ఫారంలు సంక్లిష్టమైన పదజాలాన్ని తేలికమయం చేసి, ఫీచర్లను కళ్లముందు చూపించడంతో పాటు- తమకు చక్కగా సరిపడే ఉత్పత్తిని కొనుగోలు చేసేలా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో కస్టమర్లకు మార్గదర్శనం చేస్తాయన్నారు. తేలికమయం చేసిన కొనుగోలు ప్రక్రియ. కొనుగోలు ప్రక్రియ అనేది పారదర్శకత, సౌలభ్యం, ఖచ్చితత్వంతో కూడినట్టు- చేయబడింది. సంప్రదాయం ప్రకారం ఆఫ్‌లైన్‌ ప్రపంచంలో కొన్ని వారాల సమయం తీసుకునే ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను ఇప్పుడు డిజిటల్‌ ఫారం ఫిల్లింగ్‌, పేపర్‌ లేని డాక్యుమెంట్‌ అప్‌ లోడ్‌, ఇ-కేవైసీ ధృవీకరణ పద్ధతులతో నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేయవచ్చన్నారు. తేలికమయం చేసిన క్లెయిమ్స్‌ ప్రక్రియ. వర్చువల్‌ ఏజెంట్లు-, రౌండ్‌ ది క్లాక్‌ ఆన్‌ కాల్‌ సపోర్ట్‌ అత్యవసర పరిస్థితుల్లో చివరి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫారంలు క్లెయిమ్‌ స్టేటస్‌ గురించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుకునేందుకు వీలు కల్పిస్తాయన్నారు.

తద్వారా ఆర్థిక పరమైన షాక్‌ భారాన్ని చాలావరకు తగ్గిస్తుందన్నారు. పాలసీ డాక్యుమెంట్లకు యాక్సెస్‌. కొనుగోలు తర్వాత పాలసీ డాక్యుమెంట్ల వినియోగం తరచూ కావాల్సి వచ్చేది కాదు కాబట్టి చాలామంది వినియోగదారులు వాటి అవసరం ఏర్పడినప్పుడు వాటిని కనుగొనడానికి ఇబ్బందిపడుతుంటారు. పాలసీలను ఏ సమయంలో అయినా, ఎక్కడి నుండి అయినా సులభంగా యాక్సెస్‌ చేసుకునేందుకు డిజిటల్‌ ప్లాట్‌ఫారంలు, ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాలు వీలు కల్పిస్తాయన్నారు. సమ్మిళిత పంపిణీ. గణనీయమైన సంఖ్యలో భారతీయులకు ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులు, అత్యున్నత స్థాయి సలహాలు అందడం లేదు. మారుమూల ప్రాంతాల్లోనూ ప్రామాణిక సేవలను అందించడం, కొనుగోలుకు వీలు కల్పించడం, క్లెయిమ్‌ విషయంలో సహాయం అందించడం, సందేహాలకు పరిష్కారాలు, పాలసీ సవరణలు లాంటి వాటిని అందించడం ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫారంలు ఈ వెలితిని పూడ్చుతున్నాయన్నారు. సాంకేతికత గుణకాలు. అనేక రంగాలలో నిరూపితమైన రీతిలోనే, సాంకేతికత నిజంగానే సంబంధిత పరిశ్రమల్లో పురోగతిని వేగవంతం చేస్తుందన్నారు. ఎందుకంటే, అది అనేక వినియోగ సందర్భాలను, కస్టమర్‌ సమూహాల సమస్యలను భారీ స్థాయిలో పరిష్కరించగలదన్నారు.

మొత్తంపై తెలుసుకోవాల్సింది ఏమిటంటే… సంక్లిష్టమైన ఇన్సూరెన్స్‌ రంగంలో విశ్వాసంతో ముందుకు సాగడానికి వినియోగదారులకు సాధికారత కల్పించడంపైనే ఇన్సూరెన్స్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటు-ందన్నారు. సరళీకృత ఉత్పత్తులు, ప్రక్రియలు, కస్టమర్‌ అనుభవం దీనికి మార్గం సుగమం చేస్తాయన్నారు. 2047కల్లా అందరికీ ఇన్సూరెన్స్‌, అనే దార్శనికతతో ఇన్సూరెన్స్‌ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌ డీఏఐ) ఇన్సూరెన్స్‌ను అందరికీ అందుబాటు-లోకి తీసుకువచ్చేలా గణనీయమైన మార్పులను ప్రవేశపెడుతున్న తరుణంలో, మనం కూడా విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన ప్లాట్‌ఫారంల ద్వారా వినియోగదారులు సులభంగా ఇన్సూరెన్స్‌ అందుకునేలా భరోసా ఇచ్చి, భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి మనం కూడా అంకితమవుతున్నామని విశాల్‌ గుప్తా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement