Sunday, April 28, 2024

ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ నో ఫిక‌ర్…‌

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌వేవ్‌ వేగం గా వ్యాప్తి చెందడంతో చికిత్స విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతు న్నాయి. గతేడాది కరోనా మహమ్మారి మొదటిసారి దండయాత్ర చేసినపుడు ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ పేషెంట్‌లకు చికిత్స చేసే సమయంలో తమ ఆస్పత్రిలో సిబ్బంది, ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో అడ్మిట్‌ వారికి వైరస్‌ సోకి ఒక్కోసారి ఆస్పత్రి మొత్తం ఖాళీ చేసి శానిటేషన్‌ చేసే పరిస్థితులు నెలకొనేవి. ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో అలాంటి పరి స్థితులు తలెత్తకుండా గతేడాది కరోనా సంక్షోభం నేర్పి న అనుభవాలతో వైరస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వ కుండా సిబ్బందిని రక్షించుకోవడంతో పాటు ఆస్పత్రి కార్యకలాపాలు ఏ మాత్రం దెబ్బతినకుండా యాజ మాన్యాలు పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇతర వ్యాధుల చికిత్స, సర్జరీల కోసం ఆస్పత్రికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైరస్‌ వారికి సోకకుండా చూసుకుంటున్నాయి.
హోటళ్లు, ఇళ్లల్లోనే ట్రీట్‌మెంట్‌
కరోనా రోగులకు చికిత్స అందించడానికి హైదరా బాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులు కొత్త దారులు వెతుకు తున్నాయి. వ్యాధి నిర్ధారణ అయి లక్షణాలు ఉన్న, లేని పేషెంట్లను వారి ఇష్టాఇష్టాలను బట్టి ఇళ్లలోనో, హోటళ్లలోనో చికిత్స అందిస్తున్నాయి. మరీ అత్యవసర చికిత్స అవసరమైన పేషెంట్‌లనే ఆస్ప త్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నట్లు తెలు స్తోంది. తాము 90 శాతం కరోనా రోగులను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసు కోకుండానే చికిత్స అందించగలుగుతున్నామని హైద రాబా ద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఆపరేషన్స్‌ మేనె జర్‌ చెప్పారు. దీని వల్ల అటు కరోనా రోగులకు విజయ వంతంగా చికిత్స అందించడంతో పాటు ఇతర పేషెంట్లకు ఇబ్బంది లేకుండా చూసుకోగ లుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. సెకండ్‌వేవ్‌ లో కరోనా వ్యాప్తి ధాటి ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్య సదుపాయాలపై ఒత్తిడి ఎక్కువగా ఉందని ప్రభుత్వ, పేషెంట్లు, ఇతర స్టేక్‌ హోల్డర్ల సహకారంతో ఈసారి కరోనా పేషెంట్లను హ్యాండిల్‌ చేయగలుగుతున్నామని తెలిపారు.
వ్యాక్సినేషన్‌తో ఆస్పత్రుల సిబ్బంది సేఫ్‌
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, 45 సంవత్సరాలకు పైబడిన వారికి టీకా కార్యక్రమంలో ఆస్పత్రుల సిబ్బందికి పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందేలా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. తమ తమ ఆస్పత్రుల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ను అమలు చేశాయి. దీంతో సెకండ్‌వేవ్‌లో కరోనా రోగులకు తొలి వేవ్‌లో కంటే ధైర్యంతో మెరుగ్గా అందించగలుగుతున్నామని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. టీకా తీసుకోవడం వల్ల ఆస్పత్రుల సిబ్బందిలో ప్రస్తుతం కొవిడ్‌ సోకేవారి సంఖ్య అతి తక్కువగా ఉందని, సోకిన వారికి కూడా సీరియస్‌ అయ్యే పరిస్థితి లేదని అవి పేర్కొంటున్నాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఇచ్చిన టీకా కార్యక్రమం ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో మంచి ఫలితాలనిస్తోందని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే పలువురు సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్‌ టీకా తీసుకున్నప్పటికీ తాము ఇప్పటికీ పీపీఈ కిట్‌ తప్పక ధరిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.
ఓపీల్లో క్రాస్‌ వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తలు
ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ వార్డుల వద్ద చాలా మంది క్లాత్‌ మాస్కులు పెట్టుకుని వస్తున్నారని, దీంతో ఓపీ బ్లాక్‌ తలుపులు ఎప్పుడూ తెరచి ఉంచడంతో పాటు ఎయిర్‌ కండిషన్‌లు వాడడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల క్రాస్‌ వెంటిలేషన్‌ జరిగి కరోనా గాలి ద్వారా బయటికి వెళ్లి పోతుందని వారు పేర్కొంటున్నారు. ఇక ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలో కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందించేపుడు మాత్రం పీపీఈ కిట్లు తమను రక్షిస్తున్నాయని వారు చెబుతున్నారు.
కొవిడ్‌ జాగ్రత్తల వల్లే అధిక బిల్లులు
కరోనా రోగులకు చికిత్సనందించే క్రమంలో సిబ్బంది, ఆస్పత్రుల్లో ఉన్న ఇతర రోగులను కాపాడుకునేందుకు పక్కాగా కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని, ఈ కారణంతోనే కొవిడ్‌ పేషెంట్‌లకు ఎక్కువ బిల్లులు వేయాల్సి వస్తోందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తమ బిల్లులను సమర్ధించుకుంటున్నాయి. డాక్టర్లు, ఇతర సిబ్బంది మొత్తానికి పీపీఈ కిట్లు, ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌ స్ప్రేలు చల్లడం, ఇతర అత్యున్నత ప్రమాణాలతో కూడిన జాగ్రత్తలు తీసుకుని కొవిడ్‌ పేషెంట్‌లకు చికిత్స అందిస్తున్నామని యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. దీనికి తోడు ఇటీవల ఒక్కసారిగా బెడ్‌లు, ఆక్సిజన్‌, ఇంజక్షన్లు, మందులకు పెరిగిన డిమాండ్‌ వల్ల తమకు జరిగే సరఫరాపైనా ఆ ప్రభావం ఉంటుందని, ఆ పెరిగిన రేట్లను కూడా చికిత్స తీసు కునే వారే భరించాల్సి వస్తున్నందున కొంతవరకు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆస్పత్రుల మేనే జర్లు చెబుతున్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని విజయవంతంగా ఇంటికి తిరిగి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement